భూదాన్ పోచంపల్లి, జూలై 14 : భూదాన్ పోచంపల్లి గ్రంథాలయ నూతన చైర్మన్గా చింతకుంట్ల కృష్ణారెడ్డి నియమితులయ్యారు. మంగళవారం భూదాన్ పోచంపల్లిలో గ్రంథాలయ సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఆవాజ్ చిస్తి జారీచేసిన నియామక ఉత్తర్వులను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గ్రంథాలయ అభివృద్ధికి తన శాయశక్తుల కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ కొయ్యడ రజిని శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు పాక మల్లేష్ యాదవ్, పట్టణ మండల శాఖ అధ్యక్షుడు భారత లవ కుమార్, ఉప్పునూతల వెంకటేష్, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కొట్టంకరుణాకర్ రెడ్డి, కౌన్సిలర్లు దేవరాయకుమార్, సురపల్లి రాధిక రమేశ్, కో ఆప్షన్ మెంబర్ మద్ది మధుసూదన్ రెడ్డి తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.