దేవరకొండ రూరల్, అక్టోబర్ 13 : ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి దేవరకొండ రూరల్ మండలంలోని కొంమేపల్లి గ్రామంలో గల గిరిజన గురుకుల పాఠశాల జల దిగ్బంధంలో చిక్కుకుంది. చుట్టూ వర్షం నీరు చేరి జలమయమైంది. పాఠశాలకు ప్రహరీ లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. గత రాత్రి కురిసిన వర్షానికి మండలంలోని తాటికోల్తో పాటు పలు గ్రామాల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు ఇబ్బందిగా మారాయి.