నకిరేకల్, జనవరి 9 : పదకొండు వేల రూపాయల అప్పులు ఇద్దరి ప్రాణాల మీదికి తీసుకువచ్చింది. నకిరేకల్ బైపాస్ రోడ్డులో కత్తులతో జరిగిన దాడి కలకలం రేపింది. సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన సంజయ్‌భార్గవ్, నకిరేకల్‌కు చెందిన ప్రేమ్‌కుమార్, నాగస్వామి మూసీ పరివాహక ప్రాంతంలో చేపలు పట్టి జీవనం గడుపుతుంటారు. నాగస్వామికి ప్రేమ్‌కుమార్ రూ.11 వేలు ఇవ్వాల్సి ఉంది. కిందటి నెల పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టగా, జనవరి రెండున ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. వారం దాటినా ప్రేమ్‌కుమార్ డబ్బులు ఇవ్వకపోవడంతో నకిరేకల్ బైపాస్‌లో మాట్లాడుకుందామని అతడిని నాగస్వామి పిలిపించాడు. సంజయ్‌భార్గవ్, ప్రేమ్‌కుమార్ బైక్‌పై వచ్చారు. నాగస్వామితోపాటు క్రాంతి, వెంకన్న, అజయ్, ఉదయ్ వచ్చారు. మాట్లాడుకునే సమయంలో ఘర్షణ జరగ్గా.. నాగస్వామి వెంట వచ్చిన వ్యక్తులు సంజయ్‌భార్గవ్, ప్రేమ్‌కుమార్‌పై కత్తులతో దాడి చేశారు. ఘర్షణ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేసుకుని అపస్మారక స్థితిలో ఉన్న సంజయ్‌భార్గవ్, ప్రేమ్‌కుమార్‌ను నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాగస్వామితోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.