రామగిరి, జనవరి 22 : ‘ఒక ఆలోచన రేపటి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేస్తుంది. ఆ దిశగా ఉన్నత విద్య అందించే విద్యా సంస్థల్లో చేరితే ఆ లక్ష్యం నెరవేర్చుకునే అవకాశం లభిస్తుంది.’ అని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆలిండియా డాక్టర్ జె.శ్రీనివాస్‌రావు వివరించారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ‘లక్ష్యం-2024’ పేరుతో నల్లగొండలోని ప్రగతి జూనియర్ కళాశాలలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదువాలి.. ఎలాంటి కోర్సులు చేయాలి.. ఎలాంటి విద్యా సంస్థను ఎంపిక చేసుకోవాలనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. మూస విధానమైన కోర్సులు కాకుండా ఆధునిక టెక్నాలజీ మల్టీ డిస్ప్లెన్ డిగ్రీలు చదువాలని సూచించారు. అప్పుడే ఒక సబ్జెక్టు కాకుండా పలు సబ్జెక్టుల్లో నాలెడ్జ్ పెంచుకోవడంతోపాటు ఉద్యోగ సాధన సులభమవుతుందన్నారు. నేటి ఆధునిక కాలంలో చదివిన చదువుకు సర్టిఫికెట్ ముఖ్యం కాదు.. దానిలోని నాలెడ్జ్, సబ్జెక్టుపై పట్టు సాధించేలా నాణ్యమైన విద్య అవసరమని పేర్కొన్నారు. అందుకు ప్రతి విద్యార్థి సొంత ఆలోచనలతో లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువాలన్నారు. ఇందుకు నాణ్యత ప్రమాణాలతో బోధన అందించే సంస్థలు సైతం కీలక భూమిక పోషిస్తాయని చెప్పారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేయబోయే విద్యార్థులు ఉత్తమ బోధన, ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్స్ అందించే ఉన్నత విద్యా సంస్థలను ఎంపిక చేసుకోవాలన్నారు. నాలె డ్జ్ బేస్డ్ విధానంలో విద్యాబోధన సాగిస్తూ విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ బాటలు వేస్తున్నదని తెలిపారు. ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లో ఇంత అవకాశం ఉన్న ఏకైక ప్రైవేట్ యూనివర్సిటీ ఇదేనన్నారు. నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) విధానంలో మల్టీ డిసెప్లెన్ బీటెక్ కోర్సులను చదివే అవకాశం తమ యూనివర్సిటీ అందిస్తున్నదని తెలిపారు.
ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లో సంవత్సరానికి రూ.45 లక్షల నుంచి ఆ పై జీతాలు సంపాదిస్తూ స్థిరపడ్డారని వివరించారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో చదివిన ప్రతి విద్యార్థికి వంద శాతం ప్లేస్‌మెంట్స్ కల్పించామన్నారు. విద్యాలక్ష్మి పోర్టల్‌తో ప్రభుత్వ స్కాలర్షిప్స్, విద్యా రుణాలు పొందే అవకాశం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నదన్నారు.
తమ విద్యార్థులు పలువురు బీటెక్ తృతీయ సంవత్సరంలోనే కంపెనీలను ప్రారంభిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. కేఎల్ డీమ్డ్ 46 సంవత్సరాలుగా క్రమశిక్షణాయుతంగా అత్యుత్తమ ప్రమాణాలతో విద్యనందిస్తూ వస్తున్నదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సైతం ఇలాంటి అవకాశాలు కల్పించేలా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సామాజిక బాధ్యతగా అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యం చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా సదస్సులో వేదికపై ధైర్యంగా మాట్లాడిన ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థిని జేనిరియా ముస్కాన్తోపాటు లక్కీ డ్రాలో పేర్లు వచ్చిన పి.పూజశ్రీ, ఆర్.మౌనికకు బహుమతులు అందజేశారు.
బీటెక్‌లో ఎలాంటి కోర్సులు తీసుకోవాలి. ఎలాంటి కళాశాలలు, యూనివర్సిటీలను ఎంపిక చేసుకోవాలనే అంశాలపై నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ సదస్సు నిర్వహించి విద్యార్థులను చైతన్యం చేయడం హర్షణీయం. విద్యార్థులు ఇంటర్‌లోనే ప్రణాళికతో చదివి ఉత్తమ కోర్సులో చేరాలి. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అందించే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. మా కళాశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు నేడు దేశ, విదేశాల్లో, శాస్త్రసాంకేతిక రంగాల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారు. మాకు ఈ అవకాశం కల్పించడం సంతోషంగా ఉన్నది.
విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ విద్య కీలకం. ఈ దశలో తప్పటడుగు వేస్తే భవిష్యత్ అంధకారం అవుతుంది. రెండేండ్ల ఇంటర్మీడియట్‌ను ప్రణాళికతో చదివితే జీవితంలో ఏ రంగంలో స్థిరపడాలో ఇక్కడే బాటలు వేసుకోవచ్చు. అయితే.. ఇంటర్మీడియట్ తర్వాత ముఖ్యంగా ఎంపీసీ, బీపీసీ విద్యార్థులు ఏం చదువాలి.. త్వరగా స్థిరపడడానికి ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి.. వాటిని అభ్యసించడానికి ఎలాంటి విద్యా సంస్థలో చేరాలి. అనే అంశాలపై నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘లక్ష్యం -2024’ పేరుతో నల్లగొండలోని ప్రగతి జూనియర్ కళాశాలలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఇంటర్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఉన్నత విద్యపై ఎలాంటి అవగాహన, ఆలోచన లేని తమకు ఇంటర్మీడియట్ తర్వాత తమ ఉజ్వల భవిష్యత్తుకు ఎలా బాటలు వేసుకోవాలో.. నేటి ఆధునిక ప్రపంచంలో ఎలా ముందుకు సాగితే జీవిత లక్ష్యం చేరుకుంటామనే దానిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి భరోసా నింపారని విద్యార్థులు పేర్కొన్నారు. సదస్సు నిర్వహించిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీకి, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. సదస్సులో నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ తొవిటి మహేందర్, బ్యూరో ఇన్చార్జి మర్రి మహేందర్‌రెడ్డి, ఏడీవీటీ మేనేజర్ కైరంకొండ శివకుమార్, ప్రగతి జూనియర్ కళాశాల డైరెక్టర్ ఎన్.శశిధర్రావు, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ నల్లగొండ ఇన్చార్జి ఏకస్వామిరెడ్డి, ప్రగతి జూనియర్ కళాశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పా టు అందించేదే ఇంటిగ్రేటెడ్ మ ల్టీ కరిక్యులమ్. విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ రెండేండ్లు కీలకం. భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు ఇక్కడే చక్కటి అవకాశాలను ఎంపిక చేసుకోవాలి. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో విద్యనందించి ఉజ్వల భవిష్యత్తుకు తీసుకెళ్లే విద్యా సంస్థల్లో చేరితే మంచి అవకాశాలు వస్తాయి. ఇందు లో భాగంగానే ‘లక్ష్యం -2024’తో సదస్సులు నిర్వహిస్తూ విద్యార్థుల్లో అవగాహన పెంచుతున్నాం. ఇంజినీరింగ్‌పై చాలా మందికి అవగాహన లేక కోర్సుల ఎంపికలో తప్పులు చేస్తూ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అత్యుత్తమ ప్రమాణాలు, విలువలతో కూడిన విద్యను అందిస్తున్నది.
విద్యా సమాచారాలకు సంబంధించిన అవగాహన సదస్సులు గతంలో మెట్రో పాలిటన్ సిటీల్లో నిర్వహించేవారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు కేవలం వార్తలనే కాకుండా విద్య, ఉద్యోగ సమాచారాలను కూడా అందిస్తున్నాయి. అందులో భాగంగానే మా సంస్థలు, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా లక్ష్యం -2024 పేరుతో ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యా అవకాశాలపై సదస్సు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాయి.
నేను బీటెక్ సివిల్, మెకానికల్ కోర్సులు చేయాలనుకుంటున్నా. అయితే.. ఈ కోర్సుల్లో అమ్మాయిలు చేరితే భవిష్యత్ ఉండదని, చాలా కష్టమని అంటున్నారు. వీటిపై వివరణ కావాలని సదస్సు తర్వాత నేను వేదికపై మాట్లాడిన. నా సందేహాలను కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ శ్రీనివాస్‌రావు చక్కటి వివరణ ఇచ్చారు. ఇలాంటి సందేహాలు తెలుసుకునే చక్కటి అవకాశం మా కళాశాలలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ వారు నిర్వహించిన లక్ష్యం – 2024 సదస్సుతో తెలుసుకున్నా. భవిష్యత్‌లో ఎలా చదువాలి, ఎలాంటి కోర్సు తీసుకోవాలో తెలిసింది. ఈ సదస్సు ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నా.
– జేనిరియా ముస్కాన్, ఎంపీసీ, సెకండియర్