కోదాడ, ఆగస్టు 04 : గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల లక్ష్యమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ల గాంధీ అన్నారు. సోమవారం పాలిటెక్నిక్ డిప్లొమా ప్రథమ సంవత్సరం విద్యార్థినిలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కళాశాలలో ఉన్న మెరుగైన సదుపాయాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డైరెక్టర్ నాగార్జునరావు మాట్లాడుతూ.. విద్యార్థినులు తొలి సంవత్సర నుండి చదువుతో పాటు, ఇతర నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాలన్నారు.
అర్హత, అనుభవం ఉన్న అధ్యాపకులతో బోధన చేయిస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక లేబరేటరీతో పాటు డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేసినట్లు, విద్యార్థినులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన విద్యార్థిని బ్లేస్సిని కళాశాల చైర్మన్ నీర సత్యనారాయణ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు రమేశ్, స్రవంతి, జనార్ధన్, శివాజీ, వెంకట్రామిరెడ్డి, ఎజాజ్, మాధవి, విద్యార్థినిల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Kodada : గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్య అందించడమే ‘కిట్స్’ లక్ష్యం : ప్రిన్సిపాల్ గాంధీ