భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 9 : భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో 56వ సీనియర్ రాష్ట్ర స్థాయి 2023-24 ఖోఖో చాంపియన్ షిప్ పోటీలను శుక్రవారం డీఐఈఓ కె.నారాయణరెడ్డి, ఖో-ఖో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డి ప్రారంభించారు. మొదటి రోజు లీగ్ మ్యాచ్లు నిర్వహించారు. అంతకు ముందు సాంస్కృతిక కార్యక్రమాలు, మార్చ్ఫాస్ట్ చేపట్టారు.
ఉమ్మడి నల్లగొండ ఖో-ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి మహిళలు, పురుషులు 300 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల, జిల్లా యువజన క్రీడల అధికారి ధనంజనేయులు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు స్టాలిన్బాబు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఖో-ఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.