కేతేపల్లి: ప్రభుత్వ అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కంచుగట్ల వీరస్వామి యాదవ్, దుర్గం రమేశ్‌ల ఆధ్వర్యంలో బొప్పారం గ్రామానికి చెందిన సుమారు 100 మంది వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నాయన్నారు. పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యత ఇస్తానన్నారు. పార్టీని మరితం పటిష్టం చేసేందుకు గ్రామస్థాయి కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేయాలన్నారు.
గ్రామ సర్పంచ్ కర్ర ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, భీమారం, కొత్తపేట సర్పంచ్‌లు బి.శ్రీనివాస్‌యాదవ్, బి.జానకి రాములు, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం వెంకట్‌రెడ్డి, చిముట వెంకన్నయాదవ్, నాయకులు కె.ప్రదీప్ రెడ్డి, కొండా సైదులుగౌడ్, చల్ల కృష్ణారెడ్డి, జి.సత్యనారా యణగౌడ్, కె.లింగయ్యయాదవ్, బి.రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.