తెలంగాణ సాధనలో కేసీఆర్ కృషి చిరస్మరణీయం
తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
- ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి
భువనగిరి అర్బన్, జాన్ 2 : తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పార్టీ కార్యాలయం ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి సునీతా మహేందర్ రెడ్డి, బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పూలమాలలు వేశారు.
అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న పలువురు ఉద్యమ కారులను సన్మానించారు. కార్యక్రమంలో గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెకచేయకుండా తెలంగాణ సాధనకు చేసిన కృషిని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరువలేరన్నారు. బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎందరో ఉద్యమకారులు అమరులైనారని, అమరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేమన్నారు.
కేసీఆర్ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు ఏవీకిరణ్ కుమార్, జనగాం పాండు, పట్టణ, మండల ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్ రెడ్డి, నీల ఓంప్రకాష్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

