నీలగిరి, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ జెండాను, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లబోతు భాస్కర్‌రావు, తిప్పన విజయసింహారెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచంద్రనాయక్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అంచెలంచెలుగా అభివృద్ధి చేసి దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్‌గా కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు. అలివికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వారు విమర్శించారు.
కాంగ్రెస్ గొప్పగా చెబుతున్న అందాల పోటీలకు ప్రపంచ దేశాల నుంచి అందెగత్తెలు వచ్చారని, కానీ వారు సందర్శించిన బుద్ధ్దవనం, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, యాదగిరిగుట్ట, సెక్రటేరియట్ ఎవరు నిర్మించారని ప్రశ్నించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన శ్రీ అభినయ కూచిపూడి కళాకారులను వారు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చీర పంకజ్‌యాదవ్, బొర్రా సుధాకర్, జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, శరణ్యారెడ్డి, మాజీ కౌన్సిలర్లు కొండూరు సత్యనారాయణ, అభిమన్యు శ్రీనివాస్, సింగం రామ్మోహన్, రావుల శ్రీనివాస్‌రెడ్డి మారగోని గణేష్, దండెంపల్లి సత్తయ్య, జమాల్ ఖాద్రీ, పట్టణ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, బక్కా పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, నాయకులు బొమ్మరబోయిన నాగార్జున, కడారి కృష్ణయ్య, బడుపుల శంకర్, బొజ్జ వెంకన్న, కందుల లక్ష్మయ్య, గాలి రాధిక, కొండ్ర స్వరూప, కూన్‌రెడ్డి సరోజ, యాట జయప్రద తదితరులు ఉన్నారు.