అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా పాలన సాగిస్తున్నారని, ఆయనకు బ్రాహ్మణుల ఆశీర్వాదం ఎల్లప్పడూ ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆకాంక్షించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ధూప, దీప, నైవేద్య అర్చక సంఘం ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతే అన్నం పెట్టే రైతులు, ఆశీర్వదించే అర్చకులకు ఆదరణ పెరిగిందని అన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన ప్రణాళికలు, సంక్షేమ పథకాలే కారణమని తెలిపారు. 24గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని చెప్పారు. అటువంటి మార్పులను పండితోత్తములైన అర్చకులు జన బాహుళ్యంలోకి తీసుకెళ్లాలని కోరారు. ఎన్నో అవాంతరాలు అధిగమించి బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ధూప, దీప నైవేద్య పథకంతో అర్చకులకు గౌరవ వేతనాన్ని అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.
సూర్యాపేట రూరల్, ఆగస్టు 1 : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే అన్నం పెట్టే రైతులకు, ఆశీర్వదించే అర్చకులకు ఆదరణ పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పాలనలో మేటిగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు బ్రహ్మణోత్తముల ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మన్నెం సదాశివారెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా దీప, దూప, నైవేద్యం అర్చక సమాఖ్య ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమ్మేళనానికి హాజరైన మంత్రికి బ్రహ్మణోత్తములు వేద మంత్రాల మధ్యన శాస్త్రయుక్తంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం జ్యోతి ప్రజ్వళనతో ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రారంభించి మాట్లాడారు. అటు రైతాంగానికి ఇటు అర్చకులకు గతంలో ప్రస్తుతం ఉన్న ఆదరణలో మార్పులు గమనించాలని కోరారు. 2014కు పూర్వం అన్నం పెట్టే రైతన్న తాను రైతు అని చెప్పుకోవడానికి అలాగే అర్చకత్వం చేస్తున్నా అని చెప్పుకోవడానికి అర్చకుడు బిడియా పడే రోజుల నుంచి తాము రైతులమని.. అర్చకులమని తలెత్తుకుని చెప్పుకునే స్థాయికి తెలంగాణ సమాజం చేరుకుందన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన ప్రణాళికలే కారణమన్నారు. అటువంటి మార్పులను పండితోత్తములైన అర్చకులు జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలని కోరారు.
మీ ఆశీర్వాదాలు సీఎం కేసీఆర్‌కు ఎల్లవేళలా ఉండాలని ఆకాక్షించారు. ఎన్నో అవాంతరాలను అధిగమించి బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌కు దీప, దూప, నైవేద్యం పేరుతో గౌరవ వేతనాన్ని అందించిన ఘనత దక్కిందని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమాన్ని మేళవించి పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు. వ్యవసాయంతో పాటు గృహ, వర్తక, వాణిజ్య, వ్యాపార రంగాలతో పాటు పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఉందంటే అందుకు సీఎం కేసీఆర్ దార్శనికతనే కారణమన్నారు. అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో పోతులపాటి రామలింగేశ్వరశర్మ, గోపికృష్ణమాచార్యులు, హరికిషన్ శర్మ, లక్ష్మీనరసయ్య, ఫణికుమార్‌శర్మ, ప్రసాద్‌శర్మ పాల్గొన్నారు.
హెడ్ కానిస్టేబుల్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
శాలిగౌరారం, జూలై 1 : మండలంలోని వల్లాల గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ సట్టు సైదులు కుమారుడు మహేశ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మంగళవారం రాత్రి గ్రామానికి చేరుకొని మహేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సైదులును పరామర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు ఐతగోని వెంకన్నగౌడ్, తాళ్లూరి మురళి, కట్టా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు మామిడి సర్వయ్య, నూక కిరణ్‌కుమార్‌యాదవ్, సర్పంచ్ ఇంతియాజ్, గుజిలాల్ శేఖర్‌బాబు, కొన్రెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, చామల మహెందర్‌రెడ్డి, గుండ్లపెల్లి శంకరయ్య, మాదగోని రామలింగయ్య, అంబాల కృష్ణమూర్తిగౌడ్, భూపతి సత్యనారాయణ, భూపతి ఉపెందర్, బట్ట వీరబాబు, రాగి దావీద్, కోయగూరి సంపత్, బందెల ఉదయ్ ఉన్నారు.