భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 4 : చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు నాడు arకేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కారు వాటిని రద్దు చేయడంతో నేతన్నలు బతుకలేని పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌తో కలిసి శుక్రవారం పోచంపల్లి పట్టణంలో చేనేత కార్మికుల గృహాలను సందర్శించారు. మగ్గాల పనితీరును, చేనేత కార్మికుల జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
చీరెలకు గిరాకీ, మారెటింగ్ సౌకర్యం, ప్రభుత్వ పథకాలు కొనసాగుతున్నాయా? అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుల వృత్తులను నిర్వీర్యం చేస్తుందన్నారు. నేతన్నలకు రూ.2లక్షల రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు నూలుపై అందించే సబ్సిడీని తొలగించడం సరికాదన్నారు. గీత కార్మికులకు ప్రమాద బీమా రూ.10 లక్షలు ఇస్తానని చెప్పి ఇంతవరకూ అమలు చేయలేదని విమర్శించారు. నేతన్న పొదుపు పథకాన్ని వెంటనే ప్రారంభించాలని, టెసో ద్వారా చేనేత వస్త్రాల కొనుగోలు చేపట్టి మారెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
నేత కార్మికుల సంక్షేమం కోసం పాత సీమ్‌లు కొనసాగించాలన్నారు. భూదాన్ పోచంపల్లి యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్‌తో బెస్ట్ టూరిజం విలేజ్‌గా గౌరవం దకించుకుందని తెలిపారు. పర్యాటక కేంద్రమైన పోచంపల్లికి మరిన్ని నిధులు కేటాయించి మరింతగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాతుక లింగస్వామి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చిలువేరు బాలనర్సింహ, పట్టణ ప్రధాన కార్యదర్శి గునిగంటి మల్లేశ్‌గౌడ్, నాయకులు సీత శ్రవణ్, కిరణ్, లక్ష్మీనారాయణ, పాల్గొన్నారు.