కట్టంగూర్, జూన్ 19 : రైతు బంధు అంటే గుర్తొచ్చేది మాజీ సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ కట్టంగూర్ మండల నాయకుడు పెద్ది బాలనర్సయ్యగౌడ్ అన్నారు. గురువారం కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టోలో పెట్టకుండా రైతు బంధు ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. గ్రామాలకు నిధుల కేటాయింపులో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందన్నారు. పాలనా వైఫల్యాలు, ఇచ్చిన హామీలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసులు పెడుతున్నట్లు తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, అది గ్రహించిన రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నట్లు పేర్కొన్నారు.