తెరాటిగూడెం గ్రామవాసి కత్తి స్వాతికి జేఎన్టీయూహెచ్ డాక్టరేట్
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తెరాటిగూడెం గ్రామానికి చెందిన కత్తి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కత్తి స్వాతికి జేఎన్టీయూహెచ్ డాక్టరేట్ లభించింది. హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్)లో సోమవారం నిర్వహించిన వైవా...
నీలగిరి, నవంబర్ 16 : నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తెరాటిగూడెం గ్రామానికి చెందిన కత్తి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కత్తి స్వాతికి జేఎన్టీయూహెచ్ డాక్టరేట్ లభించింది. హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్)లో సోమవారం నిర్వహించిన వైవా వోస్ను విజయవంతంగా పూర్తి చేసింది. సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న కత్తి స్వాతి, జేఎన్టీయూహెచ్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జి.నరసింహ పర్యవేక్షణలో తన పరిశోధనను పూర్తి చేశారు. ఇంటెలిజెంట్ నెట్వర్క్ ట్రాఫిక్ విశ్లేషణలో డీప్ లెర్నింగ్ నమూనాల సామర్థ్యాన్ని మెరుగుపరిచే అంశాలపై ఆమె పరిశోధన సాగింది. ఈ అంశంపై పరిశోధనా సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించి, వైవా వోస్ను విజయవంతంగా పూర్తి చేయడంతో డాక్టరేట్ పట్టా పొందేందుకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమెను అభినందించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తెరాటిగూడెం గ్రామవాసి కత్తి స్వాతికి జేఎన్టీయూహెచ్ డాక్టరేట్
Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా దక్షిణాఫ్రికాలో 14 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
‘చేయూత పెన్షన్దారులకు న్యాయం చేయాలి’
MLA sudhir reddy | రేవంత్ తాగునీళ్లు కూడా దొరకవంటే.. ఉత్తమ్ తాగునీటి కొరత లేదంటాడు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
సింగరేణి ప్రతి ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యం : ఏరియా జీఎం సిహెచ్.వెంకటరమణ
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

