‘చేయూత పెన్షన్‌దారులకు న్యాయం చేయాలి’
కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజనల్లో వివిధ చిన్న చిన్న కారణాల పేరుతో కరెంట్ బిల్లు, నాలుగు చక్రాల వాహనం, స్లాబ్ ఇల్లు ఉందనే చిన్న చిన్న కారణాలతో అర్హత ఉండి కూడా పేదల పెన్షన్లు ఆపడం సరైంది కాదని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు మునిగడప వెంకటేశ్వర్లు...
– చిన్న, చిన్న కారణంతో పెన్షన్‌దారులను బాధ పెట్టడం సరికాదు
– అర్హులందరికీ పెన్షన్లు అందించాలని డీఆర్డీఓ జాయింట్ కలెక్టర్ విద్యా చందనకు సిపిఐ ప్రతినిధి బృందం వినతి
రుద్రంపూర్, నవంబర్ 16 : కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజనల్లో వివిధ చిన్న చిన్న కారణాల పేరుతో కరెంట్ బిల్లు, నాలుగు చక్రాల వాహనం, స్లాబ్ ఇల్లు ఉందనే చిన్న చిన్న కారణాలతో అర్హత ఉండి కూడా పేదల పెన్షన్లు ఆపడం సరైంది కాదని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు మునిగడప వెంకటేశ్వర్లు, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి భూక్య శ్రీనివాస్, 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ జాయింట్ కలెక్టర్, డిపిఆర్ఓ విద్యా చందనకు వివరించారు. చిన్న చిన్న కారణాలతో నిలిపివేసిన వారి అందరి పెన్షన్లను తక్షణమే ఆమోదించి వారికి కూడా చేయూత అందించాలని సోమవారం గ్రీవెన్స్ డేలో వినతి పత్రం అందించి మాట్లాడారు. పైన తెలిపిన చిన్న చిన్న కారణాలతో పాటు రూ.2 వేల లోపు సింగరేణి పెన్షన్ వచ్చేవారికి చేయూత అందించడంలో మానవత దృక్పథంతో వారిని అర్హులుగా తేల్చాలని కోరారు. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్, డీఆర్డీఏ విద్యా చందన అక్కడే ఉన్న చేయూత పెన్షన్ అధికార బాధ్యులను పిలిపించి రీ ఎంక్వయిరీ చేసి అర్హులకు న్యాయం చేయాలని ఆదేశించారని సిపిఐ ప్రతినిధి బృందం తెలిపింది. వినతిపత్రం అందించిన వారిలో రెండవ ఇంక్లైన్ సర్పంచ్ నగేశ్, సిపిఐ నాయకులు ఎండీ అంకుష్, సింగిరాల రమేశ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘చేయూత పెన్షన్‌దారులకు న్యాయం చేయాలి’
MLA sudhir reddy | రేవంత్ తాగునీళ్లు కూడా దొరకవంటే.. ఉత్తమ్ తాగునీటి కొరత లేదంటాడు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
సింగరేణి ప్రతి ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యం : ఏరియా జీఎం సిహెచ్.వెంకటరమణ
చింతాబాబు మాదిగకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ అవార్డు
Puspayagam | తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా పుష్పయాగం
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

