సింగరేణి ప్రతి ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యం : ఏరియా జీఎం సిహెచ్.వెంకటరమణ
సింగరేణి సంస్థలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, గనుల్లో జరిగే ప్రమాదాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సిహెచ్ వెంకటరమణ అన్నారు. సోమవారం ఏరియా పరిధిలోని...
రుద్రంపూర్, నవంబర్ 16 : సింగరేణి సంస్థలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, గనుల్లో జరిగే ప్రమాదాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సిహెచ్ వెంకటరమణ అన్నారు. సోమవారం ఏరియా పరిధిలోని ఆర్ సి ఓ ఏ క్లబ్లో సింగరేణిలో ప్రమాదాల నివారణే లక్ష్యంగా సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ (ఎస్ ఎం పి) అమలుపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ఏరియాలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అమలుపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సి.హెచ్. వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ.. కార్మికులందరూ భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ, ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి ఏరియాలకు చెందిన అన్ని గనులు, వివిధ విభాగాల అధికారులకు ఎస్.ఎం.పి టీమ్ సభ్యులకు భద్రతా నిర్వహణ ప్రణాళికపై ఐదు బ్యాచ్‌లుగా విభజించి సోమవారం నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాన్ని అవగాహన కల్పించనున్నారు.
గనుల్లో ప్రమాదాలకు దారితీసే పరిస్థితులను ముందుగానే గుర్తించడం, ప్రమాదాలను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవడం, ఉద్యోగుల భద్రతను నిర్ధారించడం, (జీరో హార్మ్స్) ప్రమాద రహిత లక్ష్యాన్ని సాధించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. సింగరేణి సంస్థలో ప్రమాద రహిత పని వాతావరణాన్ని కల్పించి, ప్రతి ఉద్యోగి సురక్షితంగా విధులు నిర్వహించేలా చేయడమే మరియు ఈ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ముఖ్య లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు, ఏజీఎం ఈ అండ్ ఎం రామకృష్ణ, ఏఐటీయూసీ కత్తెర్ల. రాములు, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు చిలక రాజయ్య, డీజీఎం ఆర్ జి-1జీ.వి.విజయ్ కుమార్, జీవి టిసి మేనేజర్ జి.లక్ష్మణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి ప్రతి ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యం : ఏరియా జీఎం సిహెచ్.వెంకటరమణ
చింతాబాబు మాదిగకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ అవార్డు
Puspayagam | తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా పుష్పయాగం
BRS Australia | దీక్షా దివస్ స్పెషల్.. ఆస్ట్రేలియా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి : పైడిమర్రి నారాయణరావు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

