Puspayagam | తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా పుష్పయాగం
Puspayagam | తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది.
తిరుమల : తిరుమల (Tirumala ) శ్రీవారి ఆలయంలో సోమవారం సాయంత్రం పుష్పయాగ (Puspayagam ) మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు.

మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టు వస్త్రాలు, భరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేశారు. చామంతి (Chamanti ) , సంపంగి, రోజా, గన్నేరు, మల్లె ( Jasmine ) , మొల్లలు, కనకాంబరం, తామర, మాను సంపంగి, ఇతర పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు.

ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. పుష్పయాగానికి మొత్తం 9 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందించారు. శ్రీవారి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించేందుకు దాతల నుంచి పుష్పాలు సేకరించేందుకు కృషి చేసిన టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులును టీటీడీ సాధికారిక మండలి చైర్మన్ ,ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి శాలువతో ఘనంగా సన్మానించారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- Bhudevi
- flowers
- Leaves
- puspayagam
RELATED ARTICLES
తాజా వార్తలు
Puspayagam | తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా పుష్పయాగం
BRS Australia | దీక్షా దివస్ స్పెషల్.. ఆస్ట్రేలియా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి : పైడిమర్రి నారాయణరావు
Eyes | చలికాలంలో కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. వైద్య పరీక్షలు చేయించాల్సిందే.. ఎందుకంటే..?
Rahul Gandhi | SIR పై ఈసీని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వండి : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

