Rahul Gandhi | SIR పై ఈసీని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వండి : రాహుల్‌గాంధీ
Rahul Gandhi | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఇండి కూటమికి చెందిన ఇతర విపక్ష నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు 48 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని సమర్పించారు.
Rahul Gandhi : ఓటర్ల జాబితా (Voters list) ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi), ఇండి కూటమికి చెందిన ఇతర విపక్ష నేతలు సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ వేశారు. ఈ మేరకు 48 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని సమర్పించారు. దేశవ్యాప్త ‘సర్’కు సంబంధించిన నిర్ణయాలను ఈసీ కలసికట్టుగా తీసుకుందా..? లేదంటే ఇతర ఎన్నికల కమిషనర్ల అంగీకారం లేకుండా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఈసీ అధికారాలను వినియోగించారా..? అనే ప్రశ్న కూడా అందులో ఉంది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆథరైజేషన్, జాబితాల నుంచి ఓటర్ల తొలగింపు ఆరోపణలు, ఎన్నికల సంఘం ఆన్లైన్ ఎలక్టోరల్ నమోదు వ్యవస్థల్లో మార్పులకు సంబంధించిన అంశాలపై డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నుంచి సమాధానాలను కోరారు. దేశవ్యాప్త సర్ ప్రక్రియకు అధికారం ఇస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం రికార్డుగా లేకపోవడం, ఆన్లైన్ ఫారం-6 లో చేసిన మార్పులు, ఈసీఐనెట్, ఈఆర్వోనెట్ ఓటర్ల జాబితా డేటాబేస్‌ల పనితీరుపై కూడా రాహుల్ గాంధీ, ఇతర నేతలు ప్రశ్నలు లేవనెత్తారు.
ఈ డేటాబేస్లు కేంద్రీకృతంగా ఉన్నాయని, పారదర్శకంగా లేవని విపక్ష నేతలు ఆరోపించారు. ఈసీ పోర్టల్‌లో చేసిన అప్డేట్లు, మార్పుల వివరాలను, వాటిని అమలు చేసిన వారి సమాచారాన్ని వారు తమ పిటిషన్ ద్వారా కోరారు. ‘సర్’ కు సంబంధించి తమ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నవేనని ఈసీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిని చట్ట ప్రకారమే అమలు చేశామని పేర్కొన్నది. అదేవిధంగా ఫారం-6ను తాము సవరించలేదనీ తెలిపింది.
ఇదిలావుంటే ‘సర్’ విషయంలో సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని, ఇష్టానుసారం ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ సహా 12 మంది విపక్ష నేతలు దాఖలు చేసిన పిటిషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై ఈ నెల 17 న మరోసారి విచారణ సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | SIR పై ఈసీని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వండి : రాహుల్‌గాంధీ
మృతి చెందిన ఉపాధ్యాయురాలి కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం
‘రజక సంక్షేమ భవన కమిటీలు రద్దు’
Farmer | సాగు నీరు రాకుండా చేసిన కాంగ్రెస్ నేతలు.. రైతు ఆత్మహత్యాయత్నం.. వీడియో
Father Kills Son | తల్లిదండ్రుల మధ్య గొడవను ఆపేందుకు యత్నం.. కొడుకును కొట్టి చంపిన తండ్రి
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

