BRS Australia | దీక్షా దివస్ స్పెషల్.. ఆస్ట్రేలియా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
BRS Australia | దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భారీ రక్తదాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు.
BRS Australia | మెల్బోర్న్, ఆస్ట్రేలియా: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) చేపట్టిన చారిత్రాత్మక ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా నిర్వహించే దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భారీ రక్తదాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, ఆయన స్ఫూర్తితో సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టాలనే సంకల్పంతో ఈ రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) నాయకత్వ స్ఫూర్తితో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీ, కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్, పెర్త్, జీలాంగ్, బల్లారట్, కైర్న్స్తో పాటు టాస్మానియా ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
“తెలంగాణ కోసం నాడు కేసీఆర్ చేసిన దీక్ష ఒక చారిత్రాత్మక ఉద్యమానికి నాంది పలికింది. నేడు అదే దీక్షా స్ఫూర్తితో రక్తదానం చేసి ప్రాణాలను కాపాడటం ద్వారా సమాజానికి సేవ చేయాలన్నదే మా లక్ష్యం. రక్తదానం కంటే గొప్ప దానం మరొకటి లేదు” అని నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు.
రాజకీయాలకు అతీతంగా మానవత్వమే ప్రధాన లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియాలోని తెలంగాణవాసులు, తెలుగు ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. “దీక్షా దివస్‌ను కేవలం స్మారక దినంగా కాకుండా, ప్రాణదానానికి ప్రతీకగా నిలుపుదాం. ఒకరి రక్తదానం మరొకరి జీవితానికి ఆశాదీపం కావాలి” అని నాగేందర్ రెడ్డి అన్నారు.
Read Also :
AI Technology: ఏఐ టెక్నాలజీ రక్షణ కోసం శాన్ఫ్రాన్సిస్కో డిక్లరేషన్.. సంతకం చేసిన భారత్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటు ఏడుపాయల నుంచి ఎర్రవల్లికి పాదయాత్ర
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Australia | దీక్షా దివస్ స్పెషల్.. ఆస్ట్రేలియా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి : పైడిమర్రి నారాయణరావు
Eyes | చలికాలంలో కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. వైద్య పరీక్షలు చేయించాల్సిందే.. ఎందుకంటే..?
Rahul Gandhi | SIR పై ఈసీని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వండి : రాహుల్‌గాంధీ
మృతి చెందిన ఉపాధ్యాయురాలి కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

