చింతాబాబు మాదిగకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ అవార్డు
కోదాడ ప్రాంతానికి చెందిన దళిత ఉద్యమకారుడు చింతాబాబు మాదిగ ప్రతిష్ఠాత్మక 'డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ అవార్డు'ను అందుకున్నారు. సోమవారం న్యూఢిల్లీలోని కరోల్ బాగ్ కళామందిరంలో జాతీయ బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నేషనల్ అవార్డు గ్రహీతల...
– న్యూఢిల్లీలో జాతీయ బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో పురస్కార ప్రధానం
కోదాడ, నవంబర్ 16 : కోదాడ ప్రాంతానికి చెందిన దళిత ఉద్యమకారుడు చింతాబాబు మాదిగ ప్రతిష్ఠాత్మక ‘డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ అవార్డు’ను అందుకున్నారు. సోమవారం న్యూఢిల్లీలోని కరోల్ బాగ్ కళామందిరంలో జాతీయ బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నేషనల్ అవార్డు గ్రహీతల సత్కార సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కరోల్ బాగ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, నేషనల్ లీగల్ అడ్వైజర్ సుధారాణి, జాతీయ బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ కలిసి చింతాబాబు మాదిగకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా చింతాబాబు మాదిగ మాట్లాడుతూ.. 1990 నుండి నేటి వరకు సుదీర్ఘంగా 35 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో కొనసాగుతూ జాతికి సేవ చేస్తున్నానని తెలిపారు. మార్గదర్శి యూత్ స్ఫూర్తి, స్వచ్ఛంద దళిత ఉద్యమ కార్యక్రమాలలో తాను చేసిన సామాజిక సేవలను గుర్తించి జాతీయ బహుజన సాహిత్య అకాడమీ ఈ అవార్డు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ‘దళిత రత్న మాదిగ’ బిరుదును అందుకున్నానని, నేడు జాతీయ స్థాయిలో అంబేద్కర్ అవార్డు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ అవార్డు అందించిన అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణకు, తనకు నిరంతరం సహకరిస్తున్న ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు కేదాసి మోహన్ మాదిగలకు, తన సొంత ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చింతాబాబు మాదిగకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ అవార్డు
Puspayagam | తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా పుష్పయాగం
BRS Australia | దీక్షా దివస్ స్పెషల్.. ఆస్ట్రేలియా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి : పైడిమర్రి నారాయణరావు
Eyes | చలికాలంలో కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. వైద్య పరీక్షలు చేయించాల్సిందే.. ఎందుకంటే..?
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

