MLA sudhir reddy | రేవంత్ తాగునీళ్లు కూడా దొరకవంటే.. ఉత్తమ్ తాగునీటి కొరత లేదంటాడు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
MLA sudhir reddy | ఒకవైపు రేవంత్ రెడ్డి నీటి కొరత వస్తుంది, జాగ్రత్తగా వాడుకోండి అంటాడు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి కొరత లేదంటాడు.. ఎవరి మాట నమ్మాలి..? అని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అడిగారు.
MLA sudhir reddy | రాష్ట్రమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లో నీటి సమస్య లేదే లేదని నిన్న పత్రికా ముఖంగా చెప్పడం జరిగింది.. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన సహచరులంతా కూడా ఎక్కడా మాట్లాడినా ధైర్యంగా అబద్ధాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి నీటి కొరత లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగంగా అబద్ధాలు చెబుతున్నాడని అన్నారు. నగరానికి 750 MGD నీటి సరఫరా అవసరముంటే, కేవలం 500 MGD మాత్రమే సరఫరా అవుతుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి నీటి కొరత వస్తుంది, జాగ్రత్తగా వాడుకోండి అంటాడు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి కొరత లేదంటాడు.. ఎవరి మాట నమ్మాలి..? అని అడిగారు.
2,30,000 ట్యాంకర్లు సరఫరా చేశామని అధికారులే చెబుతారు. నీటి కొరత లేదని కూడా వాళ్లే చెబుతారు. నీటి కొరత లేనప్పుడు ట్యాంకర్లు ఎందుకు..? అని ప్రశ్నించారు. సింగూరు, మంజీరా నుంచి నీళ్లు తీసుకునే పరిస్థితి లేదు. గోదావరి నుంచి నీళ్లు ఎత్తిపోయలేదు కాబట్టి అక్కడి నుంచి కూడా నీళ్లు రావు. ఇక మిగిలింది కృష్ణా ఫేజ్–1, 2, 3 మాత్రమే. వాటి నుంచి 270 MGD మాత్రమే వస్తుంది. ముఖ్యమంత్రి తాగునీళ్లు కూడా దొరకవంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి కొరత లేదంటాడు. ఎవరి మాటలు ప్రజలు నమ్మాలి..? అన్నారు.
హైదరాబాద్ నగరానికి నీటి కొరత లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగంగా అబద్ధాలు చెబుతున్నాడు.
నగరానికి 750 MGD నీటి సరఫరా అవసరం ఉంటే, కేవలం 500 MGD మాత్రమే సరఫరా అవుతుంది.
ఒకవైపు రేవంత్ రెడ్డి నీటి కొరత వస్తుంది, జాగ్రత్తగా వాడుకోండి అంటాడు.
మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి కొరత లేదంటాడు.. ఎవరి మాట నమ్మాలి?
2,30,000 ట్యాంకర్లు సరఫరా చేశామని అధికారులే చెబుతారు. నీటి కొరత లేదని కూడా వాళ్లే చెబుతారు.
నీటి కొరత లేనప్పుడు ట్యాంకర్లు ఎందుకు?
సింగూరు, మంజీరా నుంచి నీళ్లు తీసుకునే పరిస్థితి లేదు. గోదావరి నుంచి నీళ్లు ఎత్తిపోయలేదు కాబట్టి అక్కడి నుంచి కూడా నీళ్లు రావు.
ఇక మిగిలింది కృష్ణా ఫేజ్–1, 2, 3 మాత్రమే. వాటి నుంచి 270 MGD మాత్రమే వస్తుంది.
ముఖ్యమంత్రి తాగునీళ్లు కూడా దొరకవంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి కొరత లేదంటాడు. ఎవరి మాటలు ప్రజలు నమ్మాలి?
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) November 16, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA sudhir reddy | రేవంత్ తాగునీళ్లు కూడా దొరకవంటే.. ఉత్తమ్ తాగునీటి కొరత లేదంటాడు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
సింగరేణి ప్రతి ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యం : ఏరియా జీఎం సిహెచ్.వెంకటరమణ
చింతాబాబు మాదిగకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ అవార్డు
Puspayagam | తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా పుష్పయాగం
BRS Australia | దీక్షా దివస్ స్పెషల్.. ఆస్ట్రేలియా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

