కట్టంగూర్, ఏప్రిల్ 10 : నల్లగొండ జిల్లా కట్టంగూర్ మాజీ సర్పంచ్, దివంగత కాపుగంటి సోమన్న గ్రామానికి అందించిన సేవలు మరువలేనివని మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ అన్నారు. గురువారం కట్టంగూర్‌లో నిర్వహించిన సోమన్న 25వ వర్ధంతి కార్యక్రమంలో వారు పాల్గొని సోమన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సోమన్న పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు.
కార్యక్రమంలో రెడ్డిపల్లి సాగర్, చెరుకు యాదగిరి, గట్టిగొర్ల సత్తయ్య, కాపుగంటి శ్రీను, మిట్టపల్లి శివ, అయితగోని నర్సింహ్మ, గోశిక అంజన్ కుమార్, గుండు పరమేశ్, మర్రి రాజు, బుచ్చాల వెంకన్న, కొంపెల్లి యాదయ్య, నమ్ముల సత్యనారాయణ, కాపు గంటి నరేశ్, రెడ్డిపల్లి వీరస్వామి, చెరుకు శీను, గంటెకంపు లింగయ్య, కానుగు లింగయ్య, లక్ష్మీనారాయణ, బొమ్మగంటి మహేశ్, మద్దెల గణేశ్ పాల్గొన్నారు.