నీలగిరి, ఫిబ్రవరి 6 : కేసీఆర్ పాలనలో నల్లగొండ పట్టణంలో కంచర్ల భూపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే సతీమణి కంచర్ల రమాదేవి ఓటర్లను కోరారు. శుక్రవారం 33వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థ్ధి తన్రాల స్వాతిని గెలిపించాలని కోరుతూ వీటీకాలనీ, కాకతీయ కాలనీలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్రెడితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో నార్కట్‌పల్లి మాజీ ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, చెర్వుగట్టు మాజీ సర్పంచ్ బాలకృష్ణ పాల్గొన్నారు.
గుడిపల్లి, ఫిబ్రవరి 6: దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డుకు పోటీచేస్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పంగనూరి సరితశేఖర్ గెలుపు కోరుతూ పీఏపల్లి, గుడిపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పార్టీ మండల అధ్యక్షుడు యల్గూరి వల్లపురెడ్డి, సర్పంచ్‌లు కున్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, రాయనబోయిన శ్రీనయ్య, దూదిపాల రాజేందర్‌రెడ్డి, అర్వపల్లి నరసింహ, ఎర్ర యాదగిరి, గోలి గిరి, ఆంజనేయులు, వెంకట్‌రెడ్డి, సొనగంటి రవికుమార్, వెంకట్, జానారెడ్డి, కత్తుల రమేశ్ పాల్గొన్నారు.
నందికొండ, ఫిబ్రవరి 6 : ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేసే పరిస్థితిలో ప్రజలు లేరని, బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నందికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఇన్చార్జ్, మాజీ జెడ్పీ చైర్మన్ సూర్యపేట గుజ్జ యుగేందర్రావులతో కలసి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థ్ధులు శ్రావణి, ఘని, హర్ష, అన్నపూర్ణ, పెద్దయ్య, సపావత్ చంద్రమౌలి, సయ్యద్ షాహిదాబేగం, నకిరెకంటి రమణ, బత్తుల శేఖర్‌బాబు, కోడ సరోజ, హిరేకార్ రమేష్‌జీ, ఎర్ర మంజుశ్రీలు కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుందర్‌రెడ్డి, విజయ్, నకిరెకంటి సైదులు, కోదండం, కోడ విజయ్, లక్ష్మినారాయణ, అజయ్, లక్ష్మణ్‌నాయక్, రఫీ, మక్సూద్, శివ పాల్గొన్నారు.
చిట్యాల, ఫిబ్రవరి 6: తనను కౌన్సిలర్‌గా గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించాలని, వార్డు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని 7వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కూరెళ్ల జ్యోతిలింగస్వామి అన్నారు. లింగస్వామి మాట్లాడుతూ కౌన్సిలర్‌గా గెలిచిన తనను చిరుమర్తి లింగయ్య తనపై నమ్మకంతో మున్సిపల్ వైస్ చైర్మన్ చేశారని, ఆయన సహకారంతో అభివృద్ధి పనులు చేశామన్నారు. తన భార్యను కౌన్సిలర్‌గా గెలిపిస్తే మరింత సేవ చేస్తామన్నారు.
చందంపేట(దేవరకొండ), ఫిబ్రవరి 6: తనకు ఒక్క అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధి చేసి చూపిస్తానని దేవరకొండ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డుకు పోటీచేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి నేనావత్ నాగేశ్ అన్నారు. శుక్రవారం వార్డు పరిధిలో విస్తృత ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు పరిపూర్ణాచారి, అమరేందర్, శ్రీనివాస్‌గౌడ్, కిషన్‌నాయక్, శంకర్‌నాయక్, హరిలాల్, గోపాల్, లోహిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 6: ఈ నెల 11 జరిగే నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తనను గెలింపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి సింగం లక్ష్మీ రామ్మోహన్ ఓటర్లను అభ్యర్థించారు. శుక్రవారం 47 వ డివిజన్ పరిధిలోని విద్యానగర్, సతీష్ నగర్, బోయవాడ, కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ పాలనలో , మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సహాకరంతోనే నల్లగొండ ఎంతో అభివృద్ధి చేందిందని, బీఆర్ఎస్ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.