నీలగిరి:ఐక్యతతోనే అభివృద్ది సాధ్యమవుతుందని నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భుపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని చంద్రగిరి విల్లాస్‌లో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించి, పలు అభివృద్ది పనులకు ఎంఎల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి శంకుస్ధాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల అభివృద్దికి అందరూ కలిసి కట్టుగా రాజకీయాలకు అతీతంగా పాటుపడాలన్నారు. ఐక్యతతో ఉన్నప్పుడే అభివృద్ది సాధ్యమవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు వీరెళ్లి చంద్రశేఖర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పిల్లి రామరాజు, మార్కేట్ కమిటీ చైర్మన్ బోర్రా సుదాకర్, స్ధానిక కౌన్సిలర్ జెరిపోతుల అశ్వినిబాస్కర్, కాలనీవాసులు రాపోలు దత్తగణేష్, గోవింద్ సుదాకర్, గుత్తా రవీంద్రనాథ్, మేరెడ్డి రాంరెడ్డి, పున్న కృష్ణ్, గుర్రం శంకర్, మామిళ్లపల్లి శ్రీధర్, కంభంపాటి సత్తయ్య, కొండమీది నర్సింహ్మ, అలయ అర్చకులు తదితరులు ఉన్నారు.