నీలగిరి, మార్చి 23: ప్రజా సమస్యల విషయంలో బాధితులకు అండగా ఉంటూ, ఫిర్యా దులపై వెంటనే స్పందిస్తూ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన దాదాపు 35 మంది అర్జీదారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు తమ పరిధిలోని ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిషరించడమే కాకుండా, బాధితులకు న్యాయం చేసే విషయంలో వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా కల్పించాలన్నారు. అలాగే చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కల్గించే వారి పట్ల, నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
బంకుల మూత ఇలా..
పెట్రోల్ కొరత లేకుండా చూడాలి
పట్టణంలోని భారత్ పెట్రోల్ బంక్‌కు వెళ్లా. పెట్రోల్ లేదని నిర్వాహకులు సమాధానమిచ్చారు. పెట్రోల్ లేక సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇంధన కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
-భోగ సురేశ్, వాహనదారుడు, భూదాన్‌పోచంపల్లి
కఠిన చర్యలు తీసుకుంటాం..
డీలర్లు క్రెడిట్ డిపాజిట్ చేయకపోవడంతో ఇంధన కొరత సమస్య తలెత్తింది. స్టాక్ లేకపోవడానికి, పశ్చిమాసియా యుద్ధానికి సంబంధం లేదు. డీలర్లు ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. బంకులు బంద్ చేస్తే షోకాజ్ నోటీసులు జారీ చేస్తాం. అవసరమైతే లైసెన్స్‌లు రద్దు చేస్తాం.
-రోజారాణి, డీసీఎస్వో, యాదాద్రి