సూర్యాపేట, జనవరి 3(నమస్తే తెలంగాణ) : నూత సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు కలిశారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ర్డ్డి నేతృత్వంలో హైదరాబాద్ నందినగర్‌లోని నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్,
చిరుమర్తి లింగయ్య, కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నలమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, జడ్పీ మాజీ చైర్మన్లు బండ నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రెగట్టె మల్లికార్జున్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు చాడ కిషన్‌రెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, నంద్యాల దయాకర్‌రెడ్డి, గుజ్జ యుగంధర్‌రావు, నేవూరి ధర్మేందర్‌రెడ్డి, పల్లె ప్రవీణ్‌రెడ్డి, వలమల్ల కృష్ణ, నూకల యుగంధర్‌రెడ్డి ఉన్నారు.