శాలిగౌరారం, ఫిబ్రవరి 28 : నిరుపేదల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మండలంలోని చిత్తలూరు గ్రామానికి చెందిన 15 మంది యువకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మంగళవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ మరింత బలోపేతానికి యువత కలిసిరావాలని కోరారు. మున్ముందు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, ప్రధాన కార్యదర్శి చాడ హతీశ్రెడ్డి, సీనియర్ నాయకుడు దాసరి వెంకన్న, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సోమ రమేశ్ పాల్గొన్నారు.