నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), మార్చి 21 : కాకతీయ సెక్యూరిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అటానమస్ లో శనివారం ఉద్యోగ మేళ నిర్వహించడం జరుగుతుంది. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, పాలిటెక్నిక్ లో పాస్ లేదా ఫెయిల్ అయిన విద్యార్థినులు అర్హులు. ప్రత్యేకంగా విద్యార్థినుల కోసమే ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుంది.
వివిధ విభాగాల్లో 500 పోస్టులు కలవు. జీతభత్యాలు (హాస్టల్ అలవెన్స్ తో కలిపి) రూ.17,200 వరకు ఉంటుంది. వయస్సు 18 నుండి 33 సంవత్సరాల లోపు వారు అర్హులు. ఈ జాబ్ మేళాను జిల్లాలోని విద్యార్థినులు ఉపయోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు కళాశాల టి. ఎస్. కే. సి సమన్వయకర్త ఇ.రామ్ రెడ్డి (9989217045), శ్రీనివాసులును సంప్రదించచ్చని పేర్కొన్నారు.