కోదాడ, ఆగస్టు 06 : తొలి, మలి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిదాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమరి సత్తిబాబు అన్నారు. బుధవారం జయశంకర్ సార్ జయంతి సందర్భంగా కోదాడ పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను అంకెలతో సహా వివరించడమే కాక నీళ్లు, నిధులు, నియామకాలు మనకు దక్కాలంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతోనే సాధ్యమని ప్రవచించిన మహనీయుడు జయశంకర్ సార్ అన్నారు.
అలాగే కేఆర్ జూనియర్ కళాశాలలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు గోపాల్, కర్ల సుందర్ బాబు, దొంగరి శ్రీనివాస్, ఉపేందర్ గౌడ్, భాగ్యమ్మ, లలిత, వెంకమ్మ, సావిత్రమ్మ, విజయమ్మ, అబూబకర్, ఆరిఫ్, నరసయ్య, వెంకట్, రాజేశ్, గోపాలకృష్ణ యాదవ్. కె ఆర్ ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రమణారెడ్డి, అధ్యాపకుడు వేముల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.