మునుగోడు, మే 02 : నల్లగొండ జిల్లా మునుగోడు బీజేపీ మండలాధ్యక్షుడిగా చొల్లేడు గ్రామానికి చెందిన పెంబల్ల జానయ్య రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో, ప్రతి బూతు స్థాయిలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన పార్టీ జిల్లా, మండల నాయకత్వానికి ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జానయ్యకు పలువురు బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.