– పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్ర కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి
నల్లగొండ, జూలై 18 : మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జన్మదిన వేడుకలు నల్లగొండ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. కార్యకర్తలు, అభిమానులు భారీ కేక్ ఏర్పాటు చేయగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కట్ చేశారు. ఈ సందర్భంగా రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా ప్రజల పక్షాన జగదీశ్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జగదీశ్‌రెడ్డి ఉద్యమకాలం నుండి కేసీఆర్ వెన్నంటి ఉంటూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఎవరిన్ని కుట్రలు పన్నినా ఆయన నాయకత్వంలో ఉమ్మడి జిల్లాలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని ఉమ్మడి నల్లగొండ జిల్లాను సమర్థవంతమైన తన నాయకత్వంలో జగదీశ్‌రెడ్డి ఎంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించి మరింతగా ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి పాటుపడే విధంగా భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, పార్టీ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కనగల్, తిప్పర్తి, నల్లగొండ మండలాల అధ్యక్షులు అయితగోని యాదయ్య, పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, దేప వెంకట్‌రెడ్డి, ముఖ్య నాయకులు సింగం రామ్మోహన్, బక్క పిచ్చయ్య, కంచనపల్లి రవీందర్రావు, కొండూరు సత్యనారాయణ, రావుల శ్రీనివాస్‌రెడ్డి, మారగోని గణేశ్, జమాల్ ఖాద్రి, మెరుగు గోపి, అన్వర్ పాషా, గుండ్రెడ్డి యుగంధర్‌రెడ్డితో పాటు భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Nalgonda : నల్లగొండలో ఘనంగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదిన వేడుకలు