మాల్, సెప్టెంబర్ 19: తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ‘మన ఊరు.. మన ప్రభుత్వం-మన పథకాలు’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం చింతపల్లి మండలంలోని బోజ్యాతండాలో రూ.70 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన చేశారు. పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. తండాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే గ్రామాలు, పట్టణాలు, తండాల రూపురేఖలు మారాయని పేర్కొన్నారు. అభివృద్ధి పథకాలను అమలు చేయడం వల్లే ఇతర పార్టీల వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని, కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్‌రెడ్డి, మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ఉజ్జిని విద్యసాగర్‌రావు, స్థానిక సర్పంచ్ కొర్ర దీప్లాల్ నాయక్, నాయకులు చందూనాయక్, ఉజ్జిని నరేందర్‌రావు, వింజమూరి రవి, కొండల్నాయక్, మర్రు రామారావు, లాలూనాయక్, చింతకుంట్ల విజయ్, డి. ప్రసాద్, కృష్ణయాదవ్, తిరుపతి, గొవర్ధన్, ఆంజనేయులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నాయకుడికి నివాళి
కొండమల్లేపల్లి : మండలంలోని చిన్నఅడిశర్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త రావుల అనిల్‌యాదవ్ మృతికి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సంతాపం తెలిపారు. మంగళవారం గ్రామానికి వెళ్లి అనిల్ మృతదేహంపై పూలమాల వేసి నివాళుల్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కడారి అంజయ్య యాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్ సర్పంచ్ గడ్డం శ్రీరాములు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నేనావత్ రాంబాబునాయక్ నాయకులు ఉన్నారు.
ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్దే గెలుపు
దేవరకొండ, సెప్టెంబర్ 19 : వచ్చే అసెంబీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్దే గెలుపని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చందంపేట మండలం తెల్దేవర్పల్లికి చెందిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్తోనే పేదలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, సర్పంచ్‌లు ఫోరం మండలాధ్యక్షుడు దొంటెటి మల్లారెడ్డి, నాయకులు ఆనంతగిరి, రవి, గ్రామశాఖ అధ్యక్షుడు ముత్యాలు, గోవర్ధన్, రాజు, శ్రీశైలం పాల్గొన్నారు.