కోదాడ, జూన్ 18 : కోదాడ పట్టణంలోని మున్సిపాలిటీ పక్కన గల మండపం ఏరియా బడ్డీకొట్లను తొలగించాలంటూ పేద, చిరు వ్యాపారులను మున్సిపాలిటీ అధికారులు ఇబ్బందులకు గురిచేయడం సరికాదని బడ్డీకొట్ల దుకాణదారుల సంఘం అధ్యక్షుడు షేక్ నయీమ్, గౌరవాధ్యక్షుడు బొలిశెట్టి కృష్ణయ్య అన్నారు. బుధవారం మండపం ఏరియాలోని చిరు వ్యాపారులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. గత 40 సంవత్సరాలుగా చిరు వ్యాపారులు బడ్డీకొట్లను వేసుకుని మున్సిపాలిటీకి పన్నులు కడుతూ ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు.
గతంలో అనేకమంది స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించినా దురాక్రమణ కాకుండా కాపాడుకుంటూ వస్తున్నట్లు చెప్పారు. డబ్బా కొట్లను తొలగించి పేదల పొట్ట కొట్టవద్దన్నారు. మున్సిపాలిటీ అధికారులు పేద, చిరు వ్యాపారులను వేధించడం మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో కర్ల సుందర్ బాబు, షేక్ దస్తగిరి, రాజు, సైదులు, సింహాచలం, రావుఫ్, సైదులు, మౌలానా, మహమ్మద్, అబ్దుల్ రహీం, కృష్ణకుమారి, రాంబాబు, హుస్సేన్ బి, దస్తగిరి, గోపాలకృష్ణ, రాజు, నరహరి, ముస్తఫా, ఆరిఫ్, లక్ష్మీ, పుల్లయ్య పాల్గొన్నారు.