రామగిరి, ఫిబ్రవరి 19: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈనెల 25నుంచి మార్చి 18వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయడంతోపాటు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, ఫ్లయింగ్ , సిట్టింగ్ స్కాడ్స్తోపాటు ఇన్విజిలెటర్లను నియమించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 57,353మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 103 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష జరుగనుండగా గంట ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించనున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులు ఇంటర్ విద్యాశాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై, కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేనప్పటికీ పరీక్షలకు హాజరుకావచ్చుని అధికారులు వెల్లడిస్తున్నారు.
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు.
ఇప్పటికే 14 విభాగాల ఉన్నతాధికారులతో కలెక్టరేట్లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో సమీక్షలు నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియేట్ జిల్లా పరీక్షల విభాగం, హైపవర్ కమిటీతో పాటు చీఫ్ సూపరింటెండెం ట్లు, డిపార్టుమెంట్ అధికారులు విధులు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, ఇతర అధికారులకు సైతం సెల్ఫోన్ల అనుమతి లేదని ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లా
ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 57,353 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. రెగ్యులర్, ఓకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 28,732 మంది, ద్వితీయ సంవత్సరంలో 28,621 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 103 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని డివిజన్ కేంద్రాల్లో సైతం పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
విద్యాశాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటర్ పరీక్షల నిర్వహణకు అం తా సిద్ధం చేశాం. ఇప్పటికే సీఎస్, డిపార్టుమెంట్ అధికారులను శిక్షణ కూడా ఇచ్చాం. పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఫ్లయింగ్, సిట్టింగ్ స్కాడ్ బృందాలతోపాటు జిల్లా పరీక్షాల విభాగం అధికారులు పర్యవేక్షిస్తారు. ఎవరైనా కాపియింగ్‌కు పాల్పడితే పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెంట్తోపాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, వైద్య సిబ్బందితోపాటు జాగ్రత్తలు తీసుకున్నాం. నల్లగొండ జిల్లాలో 45 కేంద్రాలు ఏర్పాటు చేయగా 27,905 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. విద్యార్థులు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ల సంతకం లేనప్పటికీ పరీక్షకు అనుమతిస్తారు.
-దస్రూ నాయక్, డీఐఈవో, నల్లగొండ