తడిసిన ధాన్యం పేరుతో 50 బస్తాలు కటింగ్.. న్యాయం చేయాలని బాధిత రైతు వేడుకోలు
తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన రైతు కసిరబోయిన కిష్టయ్య ధాన్యం విక్రయంలో తనకు అన్యాయం జరిగిందని మంగళవారం ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తాను పండించిన 129 బస్తాల ధాన్యాన్ని కాంటా వేసి..
తుంగతుర్తి, జూన్ 23 : తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన రైతు కసిరబోయిన కిష్టయ్య ధాన్యం విక్రయంలో తనకు అన్యాయం జరిగిందని మంగళవారం ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తాను పండించిన 129 బస్తాల ధాన్యాన్ని కాంటా వేసి నేరేడుచర్లకు చెందిన శివ బాలాజీ రైస్ మిల్ కు లారీ లోడుతో వెళ్లింది. అక్కడ ఉన్న నిర్వాహకులు తడిసిన ధాన్యమని 50 బస్తాలు కటింగ్ చేస్తేనే ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటామని, లేకుంటే లారీని అన్లోడ్ చేయబోమని చెప్పారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో బలవంతంగా ఆ నిబంధనకు అంగీకరించాల్సి వచ్చిందని వాపోయాడు. కొనుగోలు కేంద్రాలలో రైతులు పండించిన వరి ధాన్యం తడిసినా కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పినా మిల్లర్లు మాత్రం దిగుమతి చేసుకోవడం లేదని మిల్లర్లు తరుగు, తడిసిన ధాన్యమంటూ రైతులను నిలువునా మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బాధిత రైతుకు న్యాయం చేయాలని, తడిసిన ధాన్యం పేరుతో జరుగుతున్న కోతలను అరికట్టాలని కోరాడు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

