చౌటుప్పల్ రూరల్, జూన్2 : జాతీయ రహదారులపై పెరిగిన టోల్ చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా, కేతేపల్లి మండలంలోని కొర్లపహడ్ టోల్ ప్లాజా వద్ద పెరిగిన చార్జీలను వసూలు చేయనున్నారు.
సింగిల్ జర్నీలో లైట్ మోటరు వాహనాలకు రూ.95, లైట్ కమర్షియల్ వాహనాలకు రూ.150, బస్ లేదా ట్రక్కు రూ.315, మల్టీయాక్సిల్ వాహనాలకు రూ.485, పెద్ద వాహనాలకు రూ.605 పెంచారు.