భువనగిరి అర్బన్, మే 23 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాధ్యతతో అప్పగించిన ఇన్చార్జీలు బాధ్యతో ఓటు వేయించాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆలేరు నియోజకవర్గంలో బాధ్యతలు అప్పగించిన 107 మంది ఇన్‌చార్జీలతో మంగళవారం శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 10,713 ఓటర్లకు గానూ 100 మందికి ఒక ఇన్చార్జి చొప్పున మొత్తం 107మందితోపాటు అదనంగా మరో 20 మందిని నియమించినట్లు తెలిపారు. యువజన విభాగం, సోషల్ మీడియా, మండల నాయకుల ఆధ్వర్యంలో ఇన్చార్జీలను నియమించి శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ శిక్షణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు ఏ విధంగా వేయించాలో అనేదానిపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పట్టభద్రుల ఓటు ప్రత్యేకమైందని, భిన్నంగా ఉంటుందన్న ఉద్దేశంతో శిక్షణ శిబిరం నిర్వహించమన్నారు. కార్యక్రమలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు తుంగ బాలు, సూదగాని హరిశంకర్‌గౌడ్, కొత్త యాదగిరి, రాంరెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.