ఆత్మకూరు(ఎం), ఫిబ్రవరి 28 : మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలల్లో సకల సౌలత్లు అందుబాటులోకి వచ్చాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రాఘవాపురం ప్రాథమిక పాఠశాలలో రూ.7.79లక్షలు, సింగారం ప్రాథమిక పాఠశాలలో రూ.8 లక్షలతో పూర్తిచేసిన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్నివర్గాల పిల్లలకు సమానమైన ఉత్తమ విద్యను అందించాలనే సంకల్పంతో చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంతో కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 751 పాఠశాలలకు గానూ మొదటి విడుతలో 251, రెండో విడుతలో 250, మూడో విడుతలో 250 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మాశ్రీశైలంగౌడ్, తాసీల్దార్ జయమ్మ, జడ్పీటీసీ నరేందర్‌గుప్తా, ఎంఈఓ సుధాకర్, ఎంపీడీఓ యాదగిరి, వైస్ ఎంపీపీ పద్మ, డీఈ శివకుమార్, ఏఈ ధనలక్ష్మి, సర్పంచులు దొండ కమలమ్మ, జామ యాదయ్య, ప్రధానోపాధ్యాయుడు రాందయాకర్‌రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ ఇంతియాజ్ పాల్గొన్నారు.
సైదాపురం, మాసాయిపేటలో..
యాదగిరిగుట్ట రూరల్ : మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని సైదాపురం, మాసాయిపేట గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చకటి సదుపాయాలతో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, ఎంఈఓ కృష్ణ, ఎంపీడీఓ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచులు వంటేరు సువర్ణ, బీర్ల శంకర్, హెచ్ఎంలు జగదీశ్, సతీశ్‌కుమార్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.