‘వరి కొయ్యలను కాల్చొద్దు’
వరి పంట వ్యర్థాలను (కొయ్యలను) తగలబెట్టడం వల్ల నేల తల్లికి, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, రైతు సోదరులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి కొయ్యలను కాల్చవద్దని గడ్డిపల్లి కెవికె (KVK) శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం బొల్లంపల్లిలో నిర్వహించిన...
– ఎల్ నినో దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
– వ్యవసాయ అధికారులు, కెవికె శాస్త్రవేత్తలు
అర్వపల్లి, అక్టోబర్ 27 : వరి పంట వ్యర్థాలను (కొయ్యలను) తగలబెట్టడం వల్ల నేల తల్లికి, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, రైతు సోదరులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి కొయ్యలను కాల్చవద్దని గడ్డిపల్లి కెవికె (KVK) శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం బొల్లంపల్లిలో నిర్వహించిన కేత్ బచావో అభియాన్’ కార్యక్రమం లో రైతు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త శ్రీ ఆదర్శ్ మాట్లాడుతూ… వరి కొయ్యలను తగలబెట్టడం వల్ల నేలలో ఉండే రసాయన, భౌతిక, జీవ లక్షణాలు దెబ్బతింటాయని, మిత్ర పురుగులు నాశనమై నేల సారం క్షీణిస్తుందని హెచ్చరించారు. అంతేకాకుండా, పొగ వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి ప్రజారోగ్యానికి హాని కలుగుతుందన్నారు. కొయ్యలను తగలబెట్టకుండా రోటోవేటర్ లేదా మల్చర్ సాయంతో నేలలో కలియదున్నడం వల్ల భూమిలో సేంద్రీయ పదార్థం పెరిగి నేల సారవంతమవుతుందని తెలిపారు.
రాబోయే వానకాలం సీజన్లో ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడానికి అవకాశాలు ఉన్నాయని, కాబట్టి రైతులు నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని మండల వ్యవసాయ అధికారి పెందోట గణేష్ కోరారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే ఆరుతడి పంటలు, విత్తన పత్తి, ప్రత్యామ్నాయ రకాలను ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బొల్లంపల్లి గ్రామ సర్పంచ్ అంకిరెడ్డి వీరాంజనేయులు, పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి, జాజిరెడ్డిగూడెం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి నేరెళ్ల సత్యం, DCS వాలంటీర్ చిరంజీవి, ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వరి కొయ్యలను కాల్చొద్దు’
Nana Kutti | విడుదలకు ముందే భారీ డిమాండ్.. విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ డిజిటల్ హక్కులు దక్కించుకున్న ప్రైమ్ వీడియో!
‘నల్లగొండ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
NZvIND: అభిషేక్, సూర్యవంశీ పవర్ హిట్టింగ్.. పవర్‌ప్లేలో 118/0
Sangam Banda Reservoir | సంగం బండ రిజర్వాయర్ కాల్వకు గండి.. పొలాలకు సాగునీరందక రైతుల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

