నల్లగొండ, నవంబర్ 07 : పేద విద్యార్థులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సేవలందిస్తుందని, సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థులకు ఐఎంఏ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఐఎంఏ సీనియర్ డాక్టర్ జయప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర ఐఎంఏ స్పోర్ట్స్ కల్చర్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్ సముదాయానికి నాలుగు గ్రీజర్లు అందజేసి మాట్లాడారు. సంక్షేమ హాస్టల్లో చలికాలం విద్యార్థులు స్నానం చేసేందుకు ఇబ్బంది పడకుండా గ్రీజర్లు అందజేయడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ మాజీ ప్రెసిడెంట్లు డా.పీవీఎన్ మూర్తి, డాక్టర్ అనితా రాణి, సెక్రటరీ డాక్టర్ విజయ్, నీలగిరి ప్రెసిడెంట్ డాక్టర్ ప్రవీణ్, ట్రెజరర్ డాక్టర్ జార్జ్ ప్రవీణ్, డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, విజయలక్ష్మి, స్వప్న, సత్యవతి, దూసరి భారతమ్మ పాల్గొన్నారు.