మునగాల, మే 29 : గోవులను అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో గురువారం జరిగింది. ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని మొద్దులచెరువు స్టేజీ వద్ద 65 నంబర్ జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేపట్టాం. ఆ సమయంలో కోదాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న మహీంద్ర దోస్త్ వాహనాన్ని ఆపి చూడగా అందులో 8 గోవులు ఉన్నట్లు తెలిపారు.
పట్టుబడిన గోవులను పోలీస్ స్టేషన్‌కు తరలించి వెటర్నరీ డాక్టర్‌తో చెక్ చేయించి జియాగుడలో ఉన్న గోశాలకు తరలించినట్లు తెలిపారు. డ్రైవర్ అనిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా కోదాడ పట్టణానికి చెందిన షేక్ ఖాజా మొయినుద్దీన్ గోవులను కొనుగోలు చేసి కబేళాలకు కరలిస్తున్నట్లు తెలపడంతో ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.