సూర్యాపేట, మార్చి 24 : సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన బీఆర్ఎస్వీ నాయకులను మంగళవారం పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టు ఆయన బీఆర్ఎస్వీ నాయకులు ముదిరెడ్డి అనిల్ రెడ్డి, రఫీ, సోమగాని వేణు గౌడ్ మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ నిర్వహిస్తున్న బీఆర్ఎస్వీ నాయకులను తెల్లవారుజామున అరెస్టు చేయడం అక్రమం అన్నారు. రాష్ట్రంలో ఎవరైనా స్వేచ్ఛగా తమ నిరసనలు తెలుపవచ్చు అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మాటల వరకే పరిమితం అయ్యాయన్నారు. ఇలాంటి అక్రమ అరెస్టుల ద్వారా ప్రజా వ్యతిరేకత నుండి ప్రభుత్వం తప్పించుకోలేదన్నారు. అక్రమ అరెస్టులతో పాలన చేస్తామనుకోవడం అవివేకమని అన్నారు. ప్రభుత్వం ఇకనైనా మేల్కొని విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.

సూర్యాపేటలో బీఆర్ఎస్వీ నాయకుల అక్రమ అరెస్టులు