కోదాడ రూరల్ : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మె పోస్టర్ను మంగళవారం పట్టణ పరిధిలోని లాల్ బంగ్లాలో ఐఎఫ్టీయూ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం పోరాడి తెచ్చుకున్న 29 చట్టాలను కేంద్రం తుంగలో తొక్కి కార్మికులకు పనికిరాని నాలుగు లేబర్ చట్టాలను అమలు చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానంపై తీరును తీవ్రస్థాయిలో విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులుకు గురిచేస్తుందని మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాసే విధంగా చట్టాలు ఉన్నాయని ఆరోపించారు. సార్వత్రిక సమ్మెలో దేశవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు, కర్షకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు పాల్గొన్నారు.