కోదాడ, జూలై 06 : సర్ ఫారములు సక్రమంగా నింపకపోతే ఓట్లు గల్లంతు అవుతాయని కోదాడ 9వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ చీమ నరేష్ అన్నారు. సోమవారం పట్టణ పరిధిలోని తొమ్మిదవ వార్డులో వార్డు ప్రజల సర్ ఫారములను నింపేందుకు స్వయంగా నడుం బిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకున్నవారే ఈ ఫారములను నింపలేని పరిస్థితిలో నిరక్షరాస్యులు ఎలా నింపుతారన్నారు. బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఈ ఫారములు నింపి ఓట్లు గల్లంతు కాకుండా చూడాలని ఆయన ఆర్డీఓను కోరారు. ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. బీఎల్ఓలు సదరు ఫారాలను ఇంటింటికి తిరిగి ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదన్నారు. తక్షణమే బీఎల్ఓలకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాగుల్ మీరా, షేక్ జానీ, బీఎల్ఓ వెంకటరమణ పాల్గొన్నారు.