– ఆర్టీసీ నల్లగొండ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా
నల్లగొండ సిటీ, ఏప్రిల్ 23 : ఆర్టీసీ నల్లగొండ డిపో జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ డిపోలో కార్మికులు మహాధర్నా నిర్వహించారు. అనంతరం క్లాక్ టవర్ సెంటర్ లో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. రాజ్యాంగం కల్పించిన కార్మిక చట్టాలు, ట్రేడ్ యూనియన్ హక్కులు అమలు చేయాలని కోరుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లను, కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే జేఏసీతో చర్చలు జరిపి సమ్మె విరమించే ప్రయత్నం చేయాలని లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమాల్లో జేఏసీ రాష్ట్ర నాయకులు బి.నరేందర్, యార చంద్రయ్య, బాసాని వెంకటయ్య, కేఎస్.రెడ్డి, జల్దా వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు టీజే రావు, ఎన్ఆర్సీ రాజు, మీలా ప్రభాకర్, కేఎల్ నాయక్, డిపో నాయకులు ఈఎస్ రెడ్డి, ఏఎల్ స్వామి, వీఎస్ రెడ్డి, బీఆర్ లింగం, ఎండీ అన్వర్, ఎండీ సాధిక్ పాషా, బి.శివ కుమార్, బి.శంకరమ్మతో పాటు కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.