– ప్రైవేట్ పాఠశాలల బంద్ పాటిస్తూ వేలాదిగా తరలివచ్చిన ఉపాధ్యాయులు
– ఎన్డీ కళాశాల నుండి గడియారం సెంటర్ వరకు భారీ ర్యాలీ, రూపొరెడ్డికి ఘన నివాళి
– ఉపాధ్యాయుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తెలివాలని డిమాండ్
రామగిరి, ఆగస్టు 21 : నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ, ఆమెకు నివాళి అర్పిస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు శుక్రవారం బంద్ పాటించాయి. ఉపాధ్యాయులు, కరస్పాండెంట్స్ వేలాదిగా తరలివచ్చి నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసి నల్లగొండలోని ఎన్జీ కళాశాల నుంచి గడియారం సెంటర్ వరకు ఫ్లకార్డులు, బ్యానర్స్ చేతబట్టి రూపారెడ్డి అమర్ హై అంటూ ప్రభుత్వ వైఫల్యాని ఎండగడుతూ నిరసనతో శాంతి యుత ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం, విద్యాశాఖ తక్షణమే స్పందించి విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చి ఉపాధ్యాయుల రక్షణకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ర్యాలీలో నినాదాలు చేశారు.
ట్రస్మా రాష్ట్ర నాయకులు, నల్లగొండలోని ఎంవీఆర్ విద్యా సంస్థ చైర్మన్ కొలనుపాక రవికుమార్, జిల్లా అధ్యక్షుడు ముక్కాముల రాంమోన్, డివిజన్ బాధ్యులు అల్లుబెల్లి కాంమందర్ రెడ్డి, పోలోజు నాగేందర్, వివిధ పాఠశాలల కరస్పాండెంట్స్ మాట్లాడుతూ కొండమల్లేపల్లి ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. దానిలో భాగంగానే జిల్లా కేంద్రంలో ర్యాలీ చేసినట్లు వెల్లడించారు. ఈనెల 11న ఘటన జరిగితే ఇంత వరకు సీఎం రేవంత్రెడ్డి కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, విద్యార్థి సంఘాలు హత్యను ఖండించకపోవడం, దానిపై మాట్లాడకపోవడం చాల విచారకరమన్నారు.
ఓట్ల రాజకీయాలు చేస్తూ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. సీఎం ప్రైవేట్ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్స్ లేరని మాట్లాడుతున్నారని మా పాఠశాలల్లో ఎంపీల్, పీహెచ్డ్, పీజీ, ఉపాధ్యాయ విద్య పూర్తి చేసిన అత్యంత నిపుణులైన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని విద్యాశాఖను తన వద్ద ఉంచుకన్న సీఎం ఇలా మాట్లాడటం చాల బాదగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలలు లేకుంటే విద్యార్థులందరికి ప్రభుత్వ విద్యను అందించే దైర్యం సీఎంకు ఉందాని ప్రశ్నించారు. మా ఉపాధ్యాయులు పనిచేస్తూ విద్యార్థులకు మారుతున్న కాలంకు అనుగుణంగా నాణ్యమైన విద్య అందిస్తున్నారని..? అదే ప్రత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఏ స్థాయిలో విద్య నందిస్తున్నారో.. వారిని సక్రమ మార్గంలో బోధించేలా చేసే దమ్ము ధైర్యం సీఎంకు ఉందాని ప్రశ్నించారు. రూప రెడ్డి హత్య కేసులు చూపించడంలో జిల్లా ఎస్పీ శరత్ పవర్ నేతృత్యంలో పోలీసులు చేసిన కృషి అభినందనీయమని హర్ష వ్యక్తం చేశారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ నల్లగొండలో భారీ ర్యాలీ
మైనర్ విద్యార్థులు గంజాయి, సిగరెట్లు, ఇతర చెడు అలవాట్లకు బానిసలై నేరాలకు ఒడిగడుతునానరని, దీనికి గంజాయి విక్రయదారులు (డ్రగ్ పెడ్లర్లు), రౌడీల ప్రమేయమే ముఖ్య కారణమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో గంజాయిని పూర్తిగా నిషేదించాలని డిమాండ్ చేశారు. జువైనల్ చట్టాల సవరణ చేయాలని 14 నుండి 17 సంవత్సరాల వయస్సున్న మైనర్లు సోషల్ మీడియా ప్రభావం వల్ల దారుణమైన నేరాలకు పూనుకుంటున్నారని, మైనర్ చట్టాల్లో (జువైనల్ లాస్) తక్షణమే సవరణలు తీసుకురావాలని కోరారు. నేరస్థులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పాఠశాలల్లో విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు ఉపాధ్యాయులు మందలించడాన్ని నేరంగా పరిగణించవద్దని, చట్టాల్లో మార్పులు చేసి ఉపాధ్యాయులకు భద్రత కల్పించేలా టీచర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. సక్రమ మార్గంలో ఉండేలా ఉపాధ్యాయులు విద్యార్థులను మందలిస్తే వాటిని సీరియస్ గా తీసుకోవద్దని కోరారు. అదే విధంగా తల్లిదండ్రుతు తమ పిల్లల తిరుగుళ్ళు, అలవాట్లు, సెల్ ఫోన్ వినియోగం, వారి వద్ద ఉండే డబ్బు గురించి తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. స్కూలు దాటిన తర్వాత పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులకు బాధ్యత ఉండాలని ఆవేదనతో తెలిపారు. ఉపాధ్యాయులు భయపడకుండా పాఠాలు చెప్పే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని, స్కూళ్లలోని విద్యార్థులకు క్రమం తప్పకుండా డ్రగ్స్, నైతిక విలువలపై సెమినార్లు, కౌన్సిలింగ్ తరగతులు నిర్వహించాలన్నారు.