అర్వపల్లి, జూన్ 24 : 14 సంవత్సరాలు నిండిన బాలికలకు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను వంద శాతం అమలు చేయాలని జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కేంద్ర అధికారి డాక్టర్ ప్రసిద్ద, జిల్లా క్వాలిటి మేనేజర్ డాక్టర్ భార్గవ్ అన్నారు. బుధవారం అర్వపల్లి పీహెచ్సీ పరిధిలో పర్యటించారు. నూతనంగా మంజూరైన పల్లె దవాఖాన నిర్మాణ పనులను, జాజిరెడ్డిగూడెంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రంలో UIP సెషన్ ను మానిటర్ చేసి వ్యాక్సినేషన్ రికార్డులు, కోల్డ్ చైన్ నిర్వహణ, MCP రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నగేష్ నాయక్, సీహెచ్ఓ బిచ్చు నాయక్, ఏఎన్ఎం సైదమ్మ, ఆశ కార్యకర్త నాగమ్మ పాల్గొన్నారు.