పాలకవీడు, జులై 11 : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని మహంకాళిగూడెం గ్రామంలో అడావత్ చంద్రశేఖర్ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. చంద్రశేఖర్, ఆయన భార్య కమల ఆరు బయట నిద్రిస్తుండగా ఈ తెల్లవారుజామున ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లోని రూ.60 వేల నగదుతో పాటు, రూ.1.10 లక్షల విలువ చేసే గృహోపకరణాలు, దుస్తులు దగ్ధమైనట్లు బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.