మునుగోడు, సెప్టెంబర్ 16 : మునుగోడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు మంగళవారం ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి యుగంధర్ రెడ్డి, మండల విద్యాధికారి తల్లమల్ల మల్లేశం, జిహెచ్ఎం. కె.బాల ప్రసాద్, వి.రాధిక, సిహెచ్.వెంకటయ్య, జే.బాలరాజు మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవంతో కూడుకున్న వృత్తి అని, ఉపాధ్యాయుడు విలువలతో కూడిన విద్యను అందించినప్పుడు దేశంలో గొప్ప గొప్ప విద్యావేత్తలుగా, సైంటిస్టులుగా దేశానికి ఉపయోగపడే పౌరులుగా విద్యార్థులు రూపొందుతారన్నారు. ఎంఈఓ తలమల్ల మల్లేశం మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మునుగోడు మండలంలో ప్రభుత్వ పాఠశాలలో అత్యధికంగా విద్యార్థుల నమోదు జరిగిందన్నారు. దానికి ఉపాధ్యాయులు గొప్పగా కృషి చేశారన్నారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక అయిన ఎండి.రఫీ, ఎండి.హసన్ హలీ, ఎస్ నరేష్, పి. కోటేశ్వరరావు, కే. లింగమ్మ, సిహెచ్. మయూరి, జే.ధనలక్ష్మి, ఎస్.కే.వాలీభాషా, ఎం.మురళి, జే.ధనలక్ష్మి, కె.జ్యోతి, ఏ.సత్యనారాయణ, సీ.రామకృష్ణ, యెన్.యుగంధర్ రెడ్డి, ఎం.మల్లేశం, వజ్రా షేక్,విశాలాక్షి, జే. చంద్రమౌళి, బి. అంజయ్యను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా 2025- 26 విద్యా సంవత్సరంలో అత్యధికంగా విద్యార్థుల నమోదు పెంచినందుకు మండల విద్యా విభాగం నుండి జడ్పీహెచ్ఎస్ మునుగోడు, ఎంపీపీ ఎస్ మునుగోడు, యుపిఎస్ పులిపలుపుల, జెడ్పిహెచ్ఎస్ కోరటికల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను మరియు ఉపాధ్యాయ బృందాలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో PRTU TS ఉపాధ్యాయ సంఘం నుండి PRTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు తిరందాసు సత్తయ్య, మండల అధ్యక్షుడు సయ్యద్ యూసుఫ్ పాషా, ప్రధాన కార్యదర్శి మేకల అన్నపురెడ్డి, TSUTF జిల్లా కార్యదర్శి గేర నరసింహ, మండల అధ్యక్షుడు రాములు ,ప్రధాన కార్యదర్శి పెరిక నరసింహ, TPTF జిల్లా బాధ్యులు రత్నయ్య, మండల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు ఎం. నటరాజ్, ఎం. వెంకటరెడ్డి ,TPUS మండల అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు మిరియాల మురళి , పిండి వెంకటరెడ్డి, SC, ST సంఘ మండల అధ్యక్షులు సంకు లింగయ్య, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Munugode : మునుగోడు మండల ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం