నార్కట్పల్లి, అక్టోబర్ 22 : బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్పల్లి పట్టణంలోని 2, 3వ వార్డుల్లో ఆదివారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కుంకుమ దిద్ది మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రైతు, కార్మిక పక్షపాతిగా, దివ్యాంగులు, వృద్ధ్దులకు అండగా కేసీఆర్ ప్రభుత్వం ఉందని అందుకు కారు గుర్తుకే ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, ఎంపీటీసీలు దుబ్బాక పావనీశ్రీధర్, పుల్లెంల ముత్తయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
చిట్యాల: వెలిమినేడును మండలం చేయాలని కోరుతూ వెలి మినేడు మండల సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివా రం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు వినతిపత్రం అం దజేశారు. దేశబోయిన నర్సింహ, పొలగోని శివప్రసాద్, అ డెపు మహేశ్, గణేశ్ వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు. చిట్యాల పట్టణానికి చెందిన దూదిమెట్ల రమేశ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆయన నివాసానికి వెళ్లి ఆయన మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, పొన్నం లక్ష్మయ్య పాల్గొన్నారు.