మిర్యాలగూడ: అనారోగ్యంతో బాధ పడుతున్న పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సీఎం కేసీఆర్ చేయూతనందిస్తున్నారని ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు అన్నారు. బుదవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన 108 మందికి మంజూరైన రూ. 36 లక్షల 68 వేల 500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వంలో ఇవ్వని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఉదారంగా వ్యవహరిస్తూ అనా రోగ్యంతో ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం పలు పథ కాలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఆసరా ఇస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, మట్టపల్లి సైదులు, నామిరెడ్డి కరు ణాకర్రెడ్డి, నాయకులు మోసీన్అలీ, రామకృష్ణ, ఇరుగు వెంకటయ్య ఉన్నారు.